Monday, 10 June 2019

What is Artificial intelligence ? (కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్))

కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)

                                 ఈమధ్య ఎక్కువగా సినిమాలలోనూ అలాగే ఇంటర్నెట్లోనూ హల్ చల్ చేస్తున్న ఒక పదం  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు.


అసలు కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి ?
                     ఒక మనిషి ఎలా అయితే తనకు తానుగా నిర్ణయాలను తీసుకుంటాడో. అలాగే ఈ యంత్రము( మెషిన్) కూడా తనకు తానుగా నిర్ణయాలను తీసుకోవడమే కృత్రిమ మేధస్సు.దానికోసం కంప్యూటర్లను కృత్రిమ మెదడు గా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్లోని ప్రోగ్రాం ఉపయోగించి యంత్రాలకు కృత్రిమ మేధస్సును అందిస్తున్నారు.

" కృత్రిమ మేధస్సు అనేది ఊహల మీద ఆధారపడి మనిషి మనిషి ఆలోచనలను యాంత్రీకరణ చేయడమే"

1952- 1956 మధ్యకాలాన్ని ది బర్త్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎందుకు అంటే 1956 లో కృత్రిమ మేధస్సుకు కథల ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచానికి మారడానికి  బీజం పడిన కాలం అది.

అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి పూర్తిగా అర్థం కావాలి అంటే మనిషి మెదడు మరియు జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయో ఆ తెలుసుకోవాలి.

ఏదైనా వస్తువు చూడగానే అది మనకు ముందే తెలిసి ఉంటే దాని పేరు అది దేని కోసం ఉపయోగిస్తాము వెంటనే చెప్పేస్తాం.
అసలు ఏదైనా వస్తువును చూడగానే మనం వెంటనే దాని గురించి ఎలా చెబుతున్నాం ?

ఉదాహరణకు.....

పక్క ఉన్న ఫోటో ని చూడగానే అది కాఫీ కప్ అని వెంటనే
జవాబు ఇస్తావ్. ఎందుకు అంటే అంతకుముందు
దాన్ని చూసాం అలాగే దాని గురించి విన్నాం దాని గురించి
 తెలుసుకుందాం దీనివల్ల దాని గురించి ఉన్న సమాచారం
అంతా మన మెదడులో నిక్షిప్తమై ఉంది. ఆ సమాచారం
కారణంగానే మనం ఆ ఫోటో చూడగానే దాని గురించి వెంటనే చెప్పేస్తాం?
                                                                          

               ఒకవేళ ఈ క్రింద ఉన్న ఫోటోలు చూసి అది ఏంటో చెప్పండి చూద్దాం?


Ans: తెలియదు!
ఎందుకు అంటే ఆ ఫోటోలో ఉన్న దాని గురించి మనం ఏ రోజు వినలేదు చూడలేదు దాని గురించి తెలుసుకో లేదు. దాని గురించి ఉన్న సమాచారం మన మెదడులో ఎక్కడా నిక్షిప్తమై లేదు అందుకే దానిని మనం గుర్తించలేకపోయాం.



మనిషి మెదడులో జరిగే ప్రక్రియను కంప్యూటర్ సహాయంతో ప్రపంచంలో జరిగే విషయాలను అలాగే వస్తువుల యొక్క సమాచారాన్ని మొత్తాన్ని ప్రోగ్రామ్ చేసి అది మనల పనిచేసేలా చేయడమే కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.

అసలు మనిషి మెదడు మరియు జ్ఞానేంద్రియాలు ఎలా పని చేస్తాయి?



Technical భాషలో చెప్పాలంటే మెదడును cpu గాను కళ్లను కెమెరా లాగాను చెవులను మైక్రో ఫోన్స్ లాగా అలాగే నోటిని స్పీకర్ లాగా అభివర్ణిస్తుంటారు.



ఎందుకు అంటే మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే మొదట కళ్లతో దానికి సంబంధించిన ఛాయాచిత్రాలు ( ఫొటోస్) అలాగే దాని గురించి విన్న శబ్ద తరంగాలను( sounds) దాని గురించి చదివిన సమాచారాన్ని మన మెదడులో నిక్షిప్తం చేసుకుంటాం. అంటే దీనినే కంప్యూటర్ భాషలో డేటా అంటాం.
ఆ డేటాను మెమొరీ లో స్టోర్ చేసినట్టే మానవ మెదడు ఆ డేటాను మెమరీ సెక్షన్లో స్టోర్ చేసుకుంటుంది.
దాని కారణంగానే మనం ఏ వస్తువునైనా ఏ విషయాన్నైనా చాలా సులువుగా గుర్తుపట్టగలను దాని గురించి చెప్పగలరు.

అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంత పేరును అలాగే అంతా ఆతృతను కలిగిస్తుంది. మనిషి చేసే అత్యంత మామూలు పనిని ఒక మిషన్ చేయడానికి దానికి చాలా ప్రక్రియ అవసరం. ఒక్కసారి గాని మనిషి లా ఆలోచించే యంత్రాన్ని మనుషులు కనుక్కోగలిగితే అది మనకు ఎంత సహాయం చేసిందో దానివల్ల మనకు ఎదురయ్యే దుష్పరిణామాలు కూడా అంతకంటే ఎక్కువే ఉంటాయి.
                   
                                                                                                                                    regards:
                                                                                                                   mitram electronics

What is Artificial intelligence ? (కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్))

కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)                                  ఈమధ్య ఎక్కువగా సినిమాలలోనూ అలాగే ఇంటర్నెట్లోనూ హల్ చల్ చే...